సూపర్ స్టార్ మహేష్ కి నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ సోనమ్

 Sonam kapoor Mahesh babu|Sonam kapoor Bollywood films|Sonam Kapoor|Bollywood Sonam

 

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్ లో దూకుడు తరువాత 'ఆగడు' అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ని హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం పై సోనమ్ కపూర్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ లో వివరణ ఇచ్చింది. తాను మహేష్ బాబు తో ఏ సినిమా చేయడం లేదని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


మరోవైపు 'ఆగడు' సినిమాని దూకుడు నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ తో చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు.  శ్రీనువైట్ల ఎన్టీఆర్ తో  ‘బాద్ షా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తరువాత మహేష్, శ్రీనువైట్ల మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu